అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం - రోడ్డు నిర్మాణ ప్రాంతంలో చెలరేగిన మంటలు.. ఏడుగురు మృతి

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల కోసం బ్లాస్టింగ్‌ పనులు చేపట్టారు. ఓ యంత్రంలో డీజిల్‌ నింపుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Published on: Oct 24, 2026, 11:49:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతంలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం
అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం

ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు. అనంతగిరి మండలం పినకోట గ్రామంలో ప్రస్తుతం రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ నిర్మాణ ప్రాంతం ప్రధాన నగరాలు, ఇంధన బంకులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వాహనాలకు అవసరమైన డీజిల్‌ను డ్రమ్ములలో సేకరించి…. నిల్వ ఉంచిన వాహనాల ద్వారా నిర్మాణ ప్రాంగణానికి తీసుకువస్తారు.

ఈ క్రమంలోనే శనివారం రోజున ఒక డంపర్ ట్రక్కులో డీజిల్ రీఫిలింగ్ (ఇంధనం నింపే) ప్రక్రియ చేపడుతుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. "ఇది ఎలాంటి పేలుడు కాదు. డీజిల్ నింపే సమయంలో కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇంధనం పోస్తున్న సమయంలో చిన్న నిప్పురవ్వ ఎగిసిపడి క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఉండవచ్చు" అని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు.

డంపర్ ట్రక్కులోకి డీజిల్ పోస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌, ఐదుగురు కార్మికులు మృతి చెందగా…. అటు వైపుగా వెళ్తున్న ఓ టీచర్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతులను టీచర్‌ సునీత(విశాఖ), మణి (దేవరాపల్లి), నారాయణ రావు(చీడకాడ), పవన్‌ కుమార్‌(కడప)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు, ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు మరొక ప్రత్యేక పోలీసు బృందం కూడా అక్కడకు చేరుకుంది. ఈ ప్రమాదంతో పినకోట గ్రామంలోనూ, సమీప ప్రాంతాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More