గత సంవత్సరం కన్నా మిన్నగా ఈ సంవత్సరం పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వివరించారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ - ముఖ్యమైన అంశాలు
- ఆంధ్రప్రదేశ్ లోని అందమైన పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
- నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఆటకాని దిబ్బ, బివి పాలెం పాయింట్ లతో పాటు ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ తదితర ప్రదేశాలలో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- శ్రీ సిటీ లో జీవ వైవిధ్యం, పచ్చదనం పరిరక్షణ అంశాల పై బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ వారి ద్వారా రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.
- సూళ్లూరుపేట ముఖ్య వేదిక వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ సిటీ, శ్రీహరి కోట, చేనేత కళాకారులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
- బి వి పాలెం బోటింగ్ పాయింట్ వద్ద పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి సాహసాత్మక క్రీడలు ఉంటాయి.
- ఫ్లెమింగో ఫెస్టివల్ లో భాగంగా స్థానిక మత్స్యకారులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా 40 నిముషాలు బోటింగ్ కు రూ.30 మరియు ఇరుక్కుం ఐ ల్యాండ్ కు అప్ అండ్ డౌన్ కు రూ.100 ధరలు నిర్ణయించారు.
- బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించడంలో తగిన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా నిఘా ఉంచుతారు.
- విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కల్పించేలా రోజుకు 3 వేలు చొప్పున రెండు రోజులకు 6 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో కార్యక్రమంలోని అన్ని అంశాలను చూపించడం జరుగుతుంది.
- సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బి వి పాలెం వద్ద ఫ్రీ బస్ లు (ఉచిత బస్సులు) ఏర్పాటు చేస్తున్నారు.

{{^htLoading}} {{/htLoading}}
జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ… ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, సందర్శకుల తాకిడికి తగిన విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చామని చెప్పారు.ఫ్లెమింగో ఫెస్టివల్ కు వచ్చే సందర్శకులు పోలీస్ శాఖ వారు సూచించిన ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}