...
...
Next Story

Tirupati Road Accident : ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ - అక్కడికక్కడే నలుగురు మృతి

Srikalahasti Road Accident : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందురు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Published on: May 4, 2026, 10:16:39 IST
Advertisement

Srikalahasti Road Accident : తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందురు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

అక్కిడకక్కడే నలుగురు మృతి…

ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్‌ - నలుగురు మృతి
ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్‌ - నలుగురు మృతి

ప్రాథమిక సమాచారం ప్రకారం….. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ అతివేగంగా ఉండటం, ఎదురుగా నిలిపి ఉన్న లారీని గమనించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఢీకొన్న వేగానికి అంబులెన్స్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో రోగి బంధువులు, అంబులెన్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడి అంబులెన్స్‌లో ఇరుక్కుపోయిన మరో ఇద్దరిని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణ చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో డ్రైవర్‌తో సహా ఆరుగురు ఉన్నట్లు తెలిసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై నిలిపి ఉంచిన లారీని గుర్తించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుల వివరాలను ఇంకా సేకరిస్తున్నారు. అప్పటివరకు క్షేమంగా ఉన్న వారు ఒక్కసారిగా మృత్యువాత పడటంతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks