ఓఎల్ఎక్స్‌లో రూ.20000కు తహసీల్దార్ ఆఫీస్.. పోలీసుల అదుపులో ఆకతాయి!
కొందరు ఆకతాయిలు చేసే పనులు వింతగా ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి కూడా అలాంటి పనే చేశాడు. ఏకంగా తహసీల్దార్ ఆఫీసును ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో ఆఫీసును ఓఎల్ఎక్స్‌లో ఓ ఆకతాయి అమ్మకానికి పెట్టాడు. దాని ధర కేవలం రూ.20 వేలు మాత్రమే అని పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి వెళ్లింది. దీంతో తహసీల్దార్ షాక్ అయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్ ఆఫీసు అమ్మకం గురించి తెగ వైరల్ అయింది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం OLXలో రూ.20,000కు అమ్మకానికి ఉంది. ఓ ఆకతాయి రెండు రోజుల క్రితం OLX యాప్‌లో ప్రభుత్వ కార్యాలయం చిత్రాన్ని అప్‌లోడ్ చేశాడు. అది వెంటనే అమ్మకానికి అందుబాటులో ఉందని తెలిపాడు.
ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి కంగుతిని పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. OLXలో అందించిన వివరాల ఆధారంగా పోలీసులు ఆకతాయిని గుర్తించడం మెుదలుపెట్టారు.
అయితే ఈ పోస్ట్ మాత్రం రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తహసీల్దార్ ఫిర్యాదుతో వెంటనే దీనిపై పోలీసులు ఆరా తీశారు. ఆ ఆకతాయి హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తెలుసుకున్నారు. సోమవారం రాత్రి తెలంగాణ పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కానీ ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేయడం కొత్త ఏమీ కాదు. గతంలోనూ చాలా ఘటనలు జరిగాయి. గతంలో హైదరాబాద్ శివారులో కొందరు భూ కబ్జాదారులు.. తక్కువ ధరకే భూములు అని ఓఎల్ఎక్స్‌లో పెట్టారు. ఫొటో, భూమి కొలతలు, జీపీఎస్ ఫొటోలను అప్‌లోడ్ చేశారు. పలు నెంబర్లను కూడా ఇచ్చారు. అయితే ఓఎల్ఎక్స్‌లో భూమి అమ్మడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


