శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్ - ఈ వారం ఉచిత స్పర్శ దర్శనం నిలిపివేత..! కారణాలివే

ఉచిత స్పర్శ దర్శనాలపై శ్రీశైలం ఆలయం అధికారులు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలుపివేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ ఈ ప్రకటనను గమనించి షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలని సూచించారు.

Published on: Jul 13, 2025 5:47 PM IST
By , , Andhrapradesh, Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ పెరిగిందని వివరించారు.

శ్రీశైలం మల్లన్న ఆలయం
శ్రీశైలం మల్లన్న ఆలయం

భక్తుల రద్దీ కారణంగా…

శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉందని ఈవో తెలిపారు. ముందస్తుగా ఉచిత స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దీంతో జూలై 15 నుంచి 18వ తేదీ వరకు కల్పించే ఉచిత స్పర్శదర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పేర్కొన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలిపివేశామని వివరించారు. భక్తులందరూ మార్పును గమనించాలని కోరారు.

ఆన్‌లైన్‌ టోకెన్లు తప్పనిసరి:

భక్తుల రద్దీతో పాటు ఇతర కారణాల రీత్యా ఇటీవలనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత స్పర్శ దర్శనానికి ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లుజారీ చేస్తున్నారు. దీంతో స్పర్శ దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్ లైన్ ద్వారా టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండటంతో పాటు పారదర్శకంగా సేవలు అందించే దిశగా ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు…. www.srisailadevasthanam.org లేదా www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, చిరునామా, ఆధార్‌ నంబరు నమోదు చేసి టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఒకరోజు ముందుగానే (సోమవారం నుంచి) వీటిని తీసుకోవచ్చు.

వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు. కానీ ప్రస్తుతం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో…కేవలం ఈ వారం మాత్రం స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తాజాగా ప్రకటన విడుదల చేశారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More