...
...
Next Story

డిసెంబర్ 27న ‘గండికోట రన్’ - పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు

కడప జిల్లా గండికోటలో డిసెంబర్ 27న 'గండికోట రన్' నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. పర్యాటకం, ఫిట్‌నెస్ పెంచేందుకు ఈ పరుగు పందేలు చేపట్టారు.ఆసక్తి ఉన్నవారు www.asaao.org లేదా www.ifnish.com వెబ్‌సైట్‌ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

Published on: Nov 28, 2026, 09:02:54 IST
Advertisement

గండికోట వారసత్వ సంపదకు విస్తృత ప్రచారం కల్పించడం, ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే లక్ష్యంతో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటలో 'గండికోట రన్' నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో 'గండికోట రన్ - 2026' పోస్టర్‌ను విడుదల చేశారు

వివిధ విభాగాల్లో పరుగు….

గండికోట
గండికోట

ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ (ఏఎస్ఏ), 'గో హెరిటేజ్ రన్స్' సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఇందులో వివిధ విభాగాల్లో పరుగు పందేలు ఉంటాయి..

  • ప్రారంభకుల కోసం 3 కి.మీ. ఫన్ రన్
  • ఔత్సాహిక రన్నర్లు, అనుభవజ్ఞులైన క్రీడాకారుల కోసం 5 కి.మీ. పరుగు
  • అనుభవజ్ఞుల కోసం 10 కి.మీ. పరుగు

ఈ పరుగులో సుమారు 1,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఫిట్‌నెస్, పర్యాటకం ద్వారా ప్రజలను గండికోట చారిత్రక, వారసత్వ వైభవానికి మరింత దగ్గర చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

చారిత్రాత్మక కోట, పెన్నా నది లోయ అందాలు, విశిష్టమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగే ఈ పరుగు.. క్రీడాకారులకు గండికోట చరిత్ర, సంస్కృతిని తెలుసుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. దీనివల్ల బాధ్యతాయుతమైన పర్యాటకం పెరుగుతుంది. అలాగే స్థానిక హోమ్‌స్టేలు, ఆహార విక్రేతలు, గైడ్‌లు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

రిజిస్ట్రేషన్ ఇలా

డిసెంబర్ 27 ఆదివారం తెల్లవారుజామున పరుగు మొదలవుతుంది. అందువల్ల క్రీడాకారులు ఒకరోజు ముందుగానే డిసెంబర్ 26 శనివారం గండికోటకు చేరుకుని తమ బిబ్‌లు తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు. శనివారం గండికోట అందాలను చూస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వీకెండ్ గడిపే అవకాశం లభిస్తుందని తెలిపారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks