ఉగ్రవాది ఇంట్లో ఏటీఎస్ సోదాలు.. ఆముదం నూనె బిజినెస్ చేస్తున్నానని ఫ్యామిలీకి చెప్పిన డాక్టర్!

ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్ సయ్యద్ అహ్మద్ మెహియుద్దీన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అతడి ఇంట్లో తాజాగా తనిఖీలు చేశారు. పలు కీలక విషయాలు తెలుసుకున్నారు.

Updated on: Nov 13, 2025, 09:19:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని దిల్లీలో పేలుడు ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సమయంలోనే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఉగ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయిన సయ్యద్ అహ్మద్ మెహియుద్దీన్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు.

అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్
అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్

రాజేంద్రనగర్‌లోని సయ్యద్ నివాసంలో మూడు గంటలపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడుకు రెండు రోజుల ముందు ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అందులో మెుహియుద్దీన్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌ ఫోర్త్ వ్యూ కాలనీలోని తన నివాసంలో రెండు మూడు నెలల కిందట సయ్యద్ మిషన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆముదం నూనె బిజినెస్ చేస్తున్నానని, చాలా లాభాలు ఉంటాయని ఇంట్లో వాళ్లకి చెప్పాడు. బిజినెస్ డీల్ ఉందంటూ పలుసార్లు గుజరాత్ వెళ్లి వచ్చాడు. ఇంట్లో వాళ్లు నమ్మేందుకు ఆముదం, ప్యూర్ ఆయిల్‌కు భారీ డిమాండ్ ఉందని పదే పదే చెప్పేవాడు. తన ఇంటినే ప్రయోగశాలగా మార్చివేసి ఆముదం గింజలను ప్రాసెస్ చేసి, వాటి వ్యర్థాలతో ప్రమాదకర రైసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు.

టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌తోపాటు పలు సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించి.. ఎన్‌క్రిప్టెడ్ మెసేజులు, డాక్యుమెంట్స్ షేర్ చేస్తూ ఉండేవాడని తెలిసింది. 15 రోజుల కిందట గుజరాత్ వెళ్లాడు సయ్యద్. అప్పటికే గుజరాత్ ఏటీఎస్ అతడిపై నిఘా పెట్టింది. గాంధీనగర్ వద్ద అరెస్ట్ చేసింది.

మరోవైపు రైసిన్ తయారీ కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తునకు సిద్ధమైంది. ఈ కేసులో ఉగ్రవాద లింకులను వెలికితీయడానికి రెడీ అవుతోంది. గుజరాత్ ఏటీఎస్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోంది. సయ్యద్‌తో సంబంధాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు అధికారులు.

దిల్లీ కారు బాంబు పేలుడు తర్వాత దేశంలోని ప్రధాన నగరాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్‌తోపాటుగా మరికొన్ని నగరాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా భాగ్యనగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌లతో చెక్ చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More