సీపీఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త కార్యదర్శి నియామకం పూర్తి అయింది. ఈసారి రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది. ఇందుకోసం ముప్పాళ్ల నాగేశ్వర్ రావు పేరు కూడా పరిశీలనకు రాగా… చివరికి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య… సీపీఐ పార్టీ అనుబంధ సంఘమైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పని చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను రామకృష్ణ చూశారు. 2014 మే నుంచి బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకు వరుసగా మూడు పర్యాయలుగా అవకాశం దక్కింది.
{{^htLoading}} {{/htLoading}}
సీపీఐ పార్టీ నిబంధనల ప్రకారం… 3 పర్యాయాలు దాటితే కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే… ఈసారి గుజ్జుల ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది. కొత్త కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు… ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.