శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - 878 అడుగులకు నీటిమట్టం, గేట్లు ఎత్తే ఛాన్స్..!

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,34,790 క్యూసెక్కులుగా ఉంది.  ఔట్ ఫ్లో  67,399 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. 

Published on: Jul 6, 2025, 13:09:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణా బేసిన్ లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో… శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ రేపోమాపో పూర్తిస్థాయి నిండిపోయే అవకాశం ఉంది. మరోవైపు క్రస్ట్ గేట్లను ఎత్తే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో - 2024) (File Photo)
శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో - 2024) (File Photo)

శ్రీశైలంలో నీటిమట్టం వివరాలు

ఇవాళ(జూలై 6 ) ఉదయం 7:43 గంటల రిపోర్ట్ ప్రకారం… ప్రాజెక్ట్ కు చేరుతున్న ఇన్ ఫ్లో 1,34,790 క్యూసెక్కులుగా ఉంది. 67,399 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. మరికొన్ని అడుగులు దాటితే… ప్రాజెక్ట్ నిండుకుండలా మారనుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తే అవకాశం ఉంది. రేపోమాపో గేట్లు ఎత్తే విషయంపై ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… వచ్చే రెండు రోజుల్లో క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

నాగాార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద…

మరోవైపు నాగార్జున సాగర్లో పరిస్థితి చూస్తే ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం నీటిమట్టం 525.8 గా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంటుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 160.06 టీఎంసీలు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 56,674 క్యూసెకులుగా కాగా… ఔట్ ఫ్లో 8,741 క్యూసెకులుగా ఉంది.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 154.95 అడుగుల నీటిమట్టం ఉంది. 20.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More