నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం… ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామన్నారు.
విద్యా సంస్థలకు సెలవు…!
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ(గురువారం) సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇక నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలు కూడా మూసివేసి ఉంటాయి. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలపై సీఎస్ సమీక్ష - కీలక ఆదేశాలు
భారీ వర్షాల నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో పాటు ఎపిఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ శ్రీ కె విజయానంద్ మాట్లాడుతూ…. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో అన్నీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
{{/usCountry}}ఈ సందర్భంగా సీఎస్ శ్రీ కె విజయానంద్ మాట్లాడుతూ…. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో అన్నీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
{{/usCountry}}ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సహయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లలో సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మేరకు సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సమాచారం అందించాలని ఆయన సూచించారు.