దక్షిణ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సోమవారం(20-10-25):
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం(21-10-25):
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.
బుధవారం(22-10-25):
బాపట్ల, ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం(23-10-25) :
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు,కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం(జి) మెరకముడిదాంలో 43.7మిమీ,అన్నమయ్య(జి) గాలివీడు 43.2మిమీ, విజయనగరం(జి) గొల్లపాడులో 43మిమీ, పాల్తేరులో41మిమీ, అల్లూరి(జి) కాకరపాడు 39.2మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
{{/usCountry}}ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం(జి) మెరకముడిదాంలో 43.7మిమీ,అన్నమయ్య(జి) గాలివీడు 43.2మిమీ, విజయనగరం(జి) గొల్లపాడులో 43మిమీ, పాల్తేరులో41మిమీ, అల్లూరి(జి) కాకరపాడు 39.2మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
{{/usCountry}}