మెుంథా తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏపీ తీరందాటినా దాని ప్రభావం ఇంకా తగ్గడం లేదు. దీంతో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల అభివృద్ధి శాఖ ప్రకటన జారీ చేసింది.

తుపాను ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ప్రాజెక్టులు, నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో నల్లమడ వాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. కట్ట మీద నుంచి నీరు పై నుంచి పారుతోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరుకు వరద నీరు భారీగా వస్తోంది. దీంతో వరద కాజ్ వే పైకి వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం-హైదరాబాద్ హైవే ప్రభావితమై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వాగులు, వంకల గుండా భారీగా వరద ప్రవాహం వెళ్తుంది. నదులకు వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
విశాఖపట్నం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, మచిలీపట్నం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇంకా ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ వర్షాలు జోరుగానే ఉన్నాయి.
చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది. దీనిపై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మరోవైపు సహాయక శిబిరాల్లో బాధితులు నడుస్తూనే ఉన్నాయి. కావాల్సిన సౌకర్యాలను అధికారులు చూసుకుంటున్నారు.
{{/usCountry}}చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది. దీనిపై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మరోవైపు సహాయక శిబిరాల్లో బాధితులు నడుస్తూనే ఉన్నాయి. కావాల్సిన సౌకర్యాలను అధికారులు చూసుకుంటున్నారు.
{{/usCountry}}