సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి
సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో పెట్టిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో పలువు మృతిచెందారు.
సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు సంభవించిన ఈ పేలుడు ధాటికి గ్రామంలోని రెండు ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఇంట్లో నివసిస్తున్న కార్మికులు తెలంగాణకు చెందిన వారని పోలీసు సూపరింటెండెంట్ ఎస్. సతీష్ పీటీఐకి తెలిపారు.
అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు రెండు ఇళ్ల శిథిలాలను తొలగించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఓ కూలీ ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


