AP SET 2025 : ఏపీ సెట్ సిలబస్ విడుదల - మీ సబ్జెక్ట్ వివరాలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: Jan 3, 2026, 11:11:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP SET-2024) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఏడాది కూడా ఏపీ సెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తుంది.

ఏపీ సెట్ సిలబస్ 2025
ఏపీ సెట్ సిలబస్ 2025

జనవరి 9వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 9, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. 2026 మార్చి 28, 29 తేదీలలో పరీక్షలు జరగనున్నాయి.

ఏపీ సెట్ సిలబస్ డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా…

  1. అభ్యర్థులు మొదటగా https://apset.net.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. Subjects అనే ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ PAPER – I(General Paper) అని కనిపిస్తోంది. దాని పక్కనే Syllabus అనే ఆప్షన్ ఉంటుంది.
  3. డౌన్లోడ్ ఆప్షన్ నొక్కితే పేపర్ -1 సిలబస్ ను పొందవచ్చు.
  4. ఇక పేపేర్ - 2 రాసే అభ్యర్థులు కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.
  5. Subjects అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే… మొత్తం 30 సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి.
  6. ఇందులో మీరు దేనికైతే అప్లయ్ చేశారో ఆ సబ్జెక్ట్ పక్కన ఉంటే డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కితే…. మీ సిలబస్ కాపీని పొందవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

పరీక్ష విధానం….

ఏపీ సెట్ (AP SET 2025) ను 2 పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.పేపర్‌- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది.

సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఏపీ సెట్ కోసం గరిష్ట వయోపరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయవచ్చు. జనరల్, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యూజీసీ(UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లు: www.apset.net.in లేదా www.andhrauniversity.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియను ఫిబ్రవరి 9, 2026 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా పూర్తి చేయవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు రూ.2,000 ఆలస్య రుసుముతో, మార్చి 5 వరకు రూ.5,000 అధిక ఆలస్య రుసుముతో దరఖాస్తులను సమర్పించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More