అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు - భారీగా భక్తుల రద్దీ
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు కీలక సూచనలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదిత్యుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉండటంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, పోలీసులు పలు సూచనలు చేశారు. ఉచిత, నగదు, డోనర్ దర్శనాలు సహా క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయని పేర్కొన్నారు. రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులందరికీ దర్శనం అవకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. భక్తలంతా సహకరించాలని కోరారు.

అరసవలి ఆలయంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయ ఆచారాలతో మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి మహాక్షీరాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకలను తిలకించేందుకు తరలివచ్చారు.జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని సూర్యభగవానుని ప్రార్థించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











