హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు డిసెంబర్ 23వ తేదీతో పూర్తి కానుంది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుండగా…. డిసెంబర్ 23వ తేదీతో గడువు ముగుస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 4 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి…. ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ప్రతిభ కనబర్చిన వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. రూ.27,000 స్టైఫండ్ చెల్లిస్తారు. https://uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
HCU టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ నోటిఫికేషన్ - సెంట్రల్ యూనివర్శిటీ, హైదరాబాద్
- ఉద్యోగాలు -టెక్నికల్ అసిస్టెంట్
- మొత్తం ఖాళీలు - 4
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం(మైక్రోసాఫ్ట్ వర్డ్) ఉండాలి.
- 50 ఏళ్ల లోపు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
- ఏడాది కాలానికిగానూ పని చేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
- దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
- ఎంపికై వారికి నెలకు రూ. 27,000 చెల్లిస్తారు.
- చిరునామా: బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హైదరాబాద్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ. - 500 046.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ఫారమ్ తో పాటు ధ్రువపత్రాలను జత చేసి పంపాలి.
- అప్లికేషన్ పంపాల్సిన చిరునామా - ANRF-PAIR ప్రాజెక్ట్, బయోకెమిస్ట్రీ డిపార్ట్ మెంట్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హైదరాబాద్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ - 500 046
- దరఖాస్తు చివరి తేదీ- 23 డిసెంబర్ 2025.
- దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://uohyd.ac.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

