శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలు విరాళం - విలువ ఎంతో తెలుసా..!
తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.23 లక్షల విలువైన బంగారు చెవి ఆభరణాలను ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు. జత కర్ణపత్రములను టీటీడీ అధికారులకు అందజేశారు.
హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు.. శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలను విరాళంగా అందజేశాడు. రూ.23 లక్షల విలువైన 178 గ్రాముల బంగారంతో వీటిని తయారు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం…. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన దీపక్ 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు. దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను టీటీడీ అధికారులకు గురువారం అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఇక ఫిబ్రవరి నెలలో పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలన టీటీడీ ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి….
- ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి ఉత్సవం.
- ఫిబ్రవరి 15న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
- శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం: ఫిబ్రవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
- శ్రీ బలరామకృష్ణుల ఆలయం: ఫిబ్రవరి 25న రోహిణి నక్షత్రం సందర్భంగా ఉత్సవర్లకు తిరుచ్చి ఉత్సవం.
- శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం : ఫిబ్రవరి 06న హస్తా నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
- శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం : ఫిబ్రవరి 07, 14, 21, 28 తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.
- అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
- ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.
- ఫిబ్రవరి 03న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
- ఫిబ్రవరి 11న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
- ఫిబ్రవరి 16న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.
- ఫిబ్రవరి 01, 08, 15, 22వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

