ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు.

పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు పవన్ కల్యాణ్. 'పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కు అభినందనలు తెలియచేస్తున్నాను. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారు.' అని పవన్ కల్యాణ్ అన్నారు.
సజ్జనార్‌తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని పవన్ కల్యాణ్ చెప్పారు. అలాగే బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చిందన్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి అరెస్ట్ చేశారు. ఇమ్మడి రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్ సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐ బొమ్మ ఇమ్మడి రవి నుంచి స్వాధీన పరుచుకున్న హార్డ్ డిస్క్‌లలో సుమారు 21 వేలకుపైగా సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ పైరసీ ద్వారా రవి రూ. 20 కోట్ల వరకు సంపాదించాడన్నారు. అందులో రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లుగా వెల్లడించారు.
ఇమ్మడి రవికి ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని చెప్పారు. ఐ బొమ్మ రవి దగ్గర దాదాపుగా 50 లక్షల మంది సమచారం ఉందని ఆయన వెల్లడించారు. డేటా కలెక్షన్ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని సీపీ వివరించారు.
{{/usCountry}}ఇమ్మడి రవికి ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని చెప్పారు. ఐ బొమ్మ రవి దగ్గర దాదాపుగా 50 లక్షల మంది సమచారం ఉందని ఆయన వెల్లడించారు. డేటా కలెక్షన్ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని సీపీ వివరించారు.
{{/usCountry}}