నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ(అక్టోబర్ 22) మధ్యాహ్ననికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణకోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు…

ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అధికారులు అలర్ట్ చేశారు.
టోల్ ఫ్రీ నెంబర్లు…
ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండరాదని సూచించారు. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదాన్నారు.
2 రోజుల వెదర్ రిపోర్ట్….
బుధవారం (22-10-25) : ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం (23-10-25) : బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి బారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.
{{/usCountry}}గురువారం (23-10-25) : బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి బారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.
{{/usCountry}}మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (జి) చిలమనూరులో 79 మిమీ, నెల్లూరు (జి) ఆత్మకూరులో 77.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక తిరుపతి(జి) మన్నారుపోలూరులో 69.7 మిమీ, గొల్లగుంటలో 68.5 మిమీ, పాపమాంబాపురంలో 64.5 మిమీ, కొండూరులో 63 మిమీ, వెంకటగిరిలో 57 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.