వాతావరణశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానికి అనుకుని ఉన్న తూర్పు భూమధ్య రేఖ హిందుమహాసముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని. ఇది నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

అల్పపీడనం ప్రభావంతో పక్క రాష్ట్రమైనా తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. అయితే శనివారం మాత్రం ఏపీలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.
అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఏపీలో ఈ 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురిసే అవకాశముందని అంచనా వేసింది. అయితే శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షాలు కురిస్తే ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత కొంత తగ్గే సూచనలున్నాన్నాయి.
తెలంగాణలో చలి తీవ్రత…
మరోవైపు తెలంగాణలో మాత్రం చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ వరకు మళ్లీ చలి గాలుల తీవ్రత ఉంటుంది. పొగమంచు పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
డిసెంబర్ వరకు చలి తీవ్రతతో ప్రజలంతా గజగజ వణికిపోయారు. ఉదయం, రాత్రి వేళలో బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా పొగమంచు పరిస్థితులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందిపడ్డారు. ఇటీవలే చలి తీవ్రత క్రమంగా తగ్గిపోయిన పరిస్థితులు కనిపించాయి. కానీ గడిచిన నాలుగైదు రోజులుగా మళ్లీ చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సంక్రాంతి తర్వాత క్రమంగా చలి తీవ్రత తగ్గే సూచనలున్నాయి.
{{/usCountry}}డిసెంబర్ వరకు చలి తీవ్రతతో ప్రజలంతా గజగజ వణికిపోయారు. ఉదయం, రాత్రి వేళలో బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా పొగమంచు పరిస్థితులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందిపడ్డారు. ఇటీవలే చలి తీవ్రత క్రమంగా తగ్గిపోయిన పరిస్థితులు కనిపించాయి. కానీ గడిచిన నాలుగైదు రోజులుగా మళ్లీ చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సంక్రాంతి తర్వాత క్రమంగా చలి తీవ్రత తగ్గే సూచనలున్నాయి.
{{/usCountry}}