...
...
Next Story

కృష్ణమ్మ పరవళ్లు - నిండుకుండలా జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!

భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు పెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో…కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జురాల నిండుకుండలా ఉండగా… మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.

Published on: May 31, 2025, 17:28:17 IST
By , , Telangana, Andhrapradesh
Prefer HTon Google
Advertisement

కొద్దిరోజులుగా ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కృష్ణమ్మ పరుగులు మొదలయ్యాయి. బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పరిధిలోని జూరాల నిండుకుండను తలపిస్తోంది. జూరాలతో పాటు సంకుశుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)
శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)

జూరాలకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో… కొన్ని గేట్లు కొంత మేర పైకి ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలజల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం…

ఇక జూరాల నుంచి కృష్ణమ్మపరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ లోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం (మే 31) ఉదయం రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 826 దాటింది. నీటినిల్వ 46 టీఎంసీలకుగా నమోదైంది. ఎగువ నుంచి 55,999 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో 800 ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరికొన్ని రోజులు పడుతుంది. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలంప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 159.77 అడుగుల నీటిమట్టం ఉంది. 25.29 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe