...
...
Next Story

ఏపీ వాసులకు శుభవార్త - ఈ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలు..! ఇవిగో వివరాలు

ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలును నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

Published on: Dec 24, 2025, 13:01:45 IST
Advertisement

ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలును ప్రకటించింది.ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ ట్రైన్ సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ట్రైన్ వివరాలు….

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

గుంతకల్లు - మార్కాపుర్ (ట్రైన్ నెబంర్ 57407) మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు… సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి… రాత్రి 11.30 గంటలకు మార్కాపుర్ రోడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.

అంతేకాకుండా మార్కాపుర్ రోడ్ నుంచి గుంతకల్లుకు (ట్రైన్ నెంబర్ 57408) మధ్య ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇది మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30కు గుంతకల్లుకు చేరుకోనుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగనుంది.

ఈ డైలీ ప్యాసింజర్ రైళ్లు…. మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.

ఈ ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టడం ద్వారా… నంద్యాల, గిద్దలూరు, కంబం ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ముఖ్యంగా విద్యార్థులకు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ నిర్ణయంపై స్థానికలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ కోసం నంద్యాల ఎంపీ శబరి… కేంద్రంతో పలుమార్లు చర్చించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks