పెట్టుబడులు పెట్టండి.. గ్లోబల్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి ఏపీ గేట్‌వే : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఇది ఒక గేట్‌వే అవుతుందని చెప్పారు.
విశాఖలో నవంబర్ 14, 15వ తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖ వచ్చారు. నోవాటెల్‌లో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి ఏపీ గేట్ వే అవుతుందని చంద్రబాబు చెప్పారు.

కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేయడం వలన సౌలభ్యం, వేగం, ఖర్చు కలిసి వస్తుందని చెప్పారు. 'వివిధ రంగాలలో అపారమైన అవకాశాలతో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రోత్సాహకాలు, వేగవంతమైన వ్యాపార అనుమతులు ఇవ్వడంలో ఏపీకి పోటీ లేదు.' అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వస్తువుల తయారీ, ఆరోగ్య సంరక్షణ, విద్యా, పర్యాటక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలలో అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో కూడా రాష్ట్రం ముందుందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.
'ఏపీలో పోర్టులతోపాటుగా రైల్వే అనుసంధానికి ప్రయత్నం చేస్తున్నాం. నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉంది. వినూత్న ఆవిష్కరణలు చేయడంలో ముందుగా ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. అనుమతుల్లో ఎటువంటి జాప్యం ఉండదు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తాం. ఏపీలో వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకొస్తున్నాం. డ్రోన్ సిటీని ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. స్పేస్ సిటీని కూడా ఏర్పాటు చేస్తాం. రవాణా రంగంలో పెద్ద ఎత్తున పోర్టులు నిర్మిస్తున్నాం.' అని చంద్రబాబు వెల్లడించారు.
విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని చంద్రబాబు అన్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అందిపుచ్చుకుంటున్నామన్నారు. ఐటీలో భారతీయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. మరోవైపు గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దానికి అనుగుణంగా 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


