IRCTC Tour : తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను చూసి రావాలా? ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ

IRCTC Tour : తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు చూసి రావాలి అనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ మీ కోసం TAMIL NADU TEMPLES & HILLS EX-VIJAYWADA పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

Published on: Mar 20, 2026, 11:18:43 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐఆర్‌సీటీసీ టూరిజం పలు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. విజయవాడ నుంచి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. విజయవాడ నుంచి మెుదలై.. తంజావూరు, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్‌లాంటి ప్రాంతాలను చూడొచ్చు. 25 ఏప్రిల్ 2026న టూర్ మెుదలవుతుంది.

తంజావూరు ఆలయం
తంజావూరు ఆలయం

మెుదటి రోజు

మధ్యాహ్నం విజయవాడ విమానాశ్రయం నుండి బయలుదేరాలి. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోవాలి. సాయంత్రం శ్రీరంగం ఆలయాన్ని సందర్శించాలి. రాత్రి భోజనం తర్వాత తిరుచ్చిలోనే బస ఉంటుంది.

రెండో రోజు

హోటల్‌లో అల్పాహారం చేయాలి. చెక్-అవుట్ చేసి తంజావూరుకు (60 కి.మీ) బయలుదేరాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. మధ్యాహ్నం రామేశ్వరానికి (240 కి.మీ) బయలుదేరాలి. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం చేసి, బస రామేశ్వరంలో ఉంటుంది.

మూడో రోజు

హోటల్‌లో అల్పాహారం చేయాలి. రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి, స్థానిక ఆలయాలను సందర్శించాలి. రాత్రి భోజనం, రామేశ్వరంలోనే బస చేస్తారు.

నాలుగో రోజు

ఉదయాన్నే/ప్యాక్ చేసిన అల్పాహారంతో చెక్-అవుట్ చేయాలి. మదురైకి (180 కి.మీ) బయలుదేరాలి. మీనాక్షి ఆలయాన్ని సందర్శించాలి. కొడైకెనాల్‌కు (120 కి.మీ) బయలుదేరాలి. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం, కొడైకెనాల్‌లో బస చేయాలి.

ఐదో రోజు

హోటల్‌లో అల్పాహారం చేయాలి. కొడైకెనాల్‌లోని స్థానిక పర్యాటక ప్రదేశాలను (బ్రియెంట్ పార్క్, గుణ గుహలు, పైన్ అడవి, పిల్లర్స్ రాక్, కొడై సరస్సు) సందర్శించాలి. రాత్రి భోజనం చేసి కొడైకెనాల్‌లో బస చేస్తారు.

ఆరో రోజు

హోటల్‌లో అల్పాహారం చేయాలి. చెక్-అవుట్ చేసి మదురైకి (120 కి.మీ) బయలుదేరాలి. విమానం ఎక్కడానికి మధ్యాహ్నానికి మదురై విమానాశ్రయం వద్ద దింపుతారు. సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు. ఏప్రిల్ 30వ తేదీతో టూర్ ముగుస్తుంది.

టూర్ ధరలు

తమిళనాడు టెంపుల్ అండ్ హిల్స్ ఎక్స్-విజయవాడ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.51050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.37900, త్రిబుల్ ఆక్యుపెన్సీకి రూ.36300గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చైల్డ్ విత్ బెడ్ రూ.31200, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.27100, 2 నుంచి 4 ఏళ్ల వరకు చైల్డ్ వితౌట్ బెడ్ రూ.21450గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం www.irctctourism.com అధికారిక వెబ్‌సైట్ వెళ్లవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More