కోనసీమ చూసొద్దామా...! హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, ఈ నెలలోనే జర్నీ

కోనసీమ అందాలను అస్వాదించాలనుకునే వారి కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇదే నెలలో జర్నీ ఉంటుంది. ముఖ్యమైన వివరాలపై ఓ లుక్కేయండి…..

Published on: Jan 16, 2026, 16:34:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పచ్చని అందాలకు ఏపీలోని కోనసీమ ఎంతో ఫేమస్…! ఒక్కసారైనా ఇక్కడ గడపాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే కోనసీమ అందాలను చూసేందుకు వీలుగా ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ పేరుతో హైదరాబాద్ ను ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ జనవరి నెలలోనే జర్నీ ఉంటుంది.

కోనసీమ
కోనసీమ

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడొచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. ప్రస్తుతం జనవరి 23వ తేదీన జర్నీ ఉంది. ఈ తేదీలో మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు https://www.irctctourism.com/ వెబ్ సైట్ నుంచి ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

జర్నీ షెడ్యూల్ ఇలా…

  1. హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08.30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి అయితే 9.15 గంటలకు గౌతమి ఎక్స్ ప్రెస్(ట్రైన్ నెంబర్ 12738) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  2. 2వ ఉదయం 4.38 గంటలకు రాజమండ్రి స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కి వెళ్తారు. ఆ తర్వాత అన్నవరం దర్శనం పూర్తవుతుంది. గోదావరి ఘాట్, ఇస్కాన్ టెంపుల్ చూస్తారు. రాత్రి రాజమండ్రిలోనే ఉంటారు.
  3. 3వ రోజు అంతర్వేదికి వెళ్తారు. నర్సింహ్మా స్వామి దర్శనం ఉంటుంది. బీచ్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి బాలాజీ టెంపుల్, అప్పన్నపల్లి, విఘ్నేశ్వరం టెంపుల్, ఐనవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షరామం వెళ్తారు. రాత్రి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది.
  4. 4వ ఉదయం 4.35 నిమిషాలకు సికింద్రాబాద్, 5.55 నిమిషాలకు లింగంపల్లికి చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 15,340, డబుల్ షేరింగ్ కు రూ. 8940, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7170గా ఉంది. అదే స్టాండర్డ్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ, 5630, డబుల్ షేరింగ్ కు రూ. 7400, సింగిల్ షేరింగ్ కు అయితే రూ. 13,800గా ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో చూడొచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More