భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. అత్యంత బరువైన LVM3-M5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా నింగిలోకి ఇది దూసుకెళ్లింది. ఈ వాహకనౌక CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగం భారతదేశ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంతరిక్ష సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతుంది. ఈ మిషన్ దేశ డిజిటల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమచారా ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బీట్‌లోకి ప్రవేశపెట్టారు.
శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం సాయంత్రం విజయవంతంగా ప్రయోగించారు. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ప్రకటన విడుదల చేశారు. ప్రయోగ సమయంలో వాహక నౌక దాని S200 సాలిడ్ బూస్టర్‌లను, పేలోడ్ ఫెయిరింగ్‌ను విజయవంతంగా వేరు చేసింది. తరువాత అది L110 లిక్విడ్ కోర్ దశలోకి, చివరి దశ అయిన C25 క్రయోజెనిక్ దశలోకి ప్రవేశించింది. మొత్తం ఆపరేషన్ సరిగ్గా ప్రణాళిక ప్రకారం జరిగింది.
సీఎంఎస్-03 ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ అన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన అందరికీ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది.
సీఎంఎస్-03 కీలక పాత్ర పోషించనుంది. ఈ ఉప్రగ్రహంతో సమాచార వ్యవస్థ మెరుగుపడటంతోపాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు ఉండనుంది. ముఖ్యంగా భారత నౌకదళం కోసం దీన్ని రూపొందించారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాల్లో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది. దీన్ని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు.
CMS-03 ఉపగ్రహం భారతదేశ టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు ఒక ప్రధాన అడుగు. ఈ ఉపగ్రహం దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది. గతంలో కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాలకు ఇంటర్నెట్, ప్రసార సేవలను తీసుకువస్తుందని చెబుతున్నారు.
{{/usCountry}}CMS-03 ఉపగ్రహం భారతదేశ టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు ఒక ప్రధాన అడుగు. ఈ ఉపగ్రహం దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది. గతంలో కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాలకు ఇంటర్నెట్, ప్రసార సేవలను తీసుకువస్తుందని చెబుతున్నారు.
{{/usCountry}}