ఇస్రో CMS-03 ప్రయోగం సక్సెస్.. నిర్ణిత కక్ష్యలోకి శాటిలైట్.. ఇది ఎందుకు ప్రత్యేకం?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. ఆదివారం సీఎంఎస్-03ను విజయవంతంగా ప్రయోగించింది.

Published on: Nov 2, 2025, 19:37:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. అత్యంత బరువైన LVM3-M5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా నింగిలోకి ఇది దూసుకెళ్లింది. ఈ వాహకనౌక CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఇస్రో CMS-03 ప్రయోగం సక్సెస్
ఇస్రో CMS-03 ప్రయోగం సక్సెస్

ఈ ప్రయోగం భారతదేశ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంతరిక్ష సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతుంది. ఈ మిషన్ దేశ డిజిటల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమచారా ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బీట్‌లోకి ప్రవేశపెట్టారు.

శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం సాయంత్రం విజయవంతంగా ప్రయోగించారు. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ప్రకటన విడుదల చేశారు. ప్రయోగ సమయంలో వాహక నౌక దాని S200 సాలిడ్ బూస్టర్‌లను, పేలోడ్ ఫెయిరింగ్‌ను విజయవంతంగా వేరు చేసింది. తరువాత అది L110 లిక్విడ్ కోర్ దశలోకి, చివరి దశ అయిన C25 క్రయోజెనిక్ దశలోకి ప్రవేశించింది. మొత్తం ఆపరేషన్ సరిగ్గా ప్రణాళిక ప్రకారం జరిగింది.

సీఎంఎస్-03 ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ అన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన అందరికీ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది.

సీఎంఎస్-03 కీలక పాత్ర పోషించనుంది. ఈ ఉప్రగ్రహంతో సమాచార వ్యవస్థ మెరుగుపడటంతోపాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు ఉండనుంది. ముఖ్యంగా భారత నౌకదళం కోసం దీన్ని రూపొందించారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాల్లో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది. దీన్ని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు.

CMS-03 ఉపగ్రహం భారతదేశ టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు ఒక ప్రధాన అడుగు. ఈ ఉపగ్రహం దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది. గతంలో కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాలకు ఇంటర్నెట్, ప్రసార సేవలను తీసుకువస్తుందని చెబుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More