చెన్నైలో డ్రైవర్ మర్డర్ - తెరపైకి జనసేన నేత పేరు..! వెలుగులోకి సంచలన విషయాలు

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుతపై హత్య ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేసే రాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెన్నైలో మృతదేహాం లభించగా… పోలీసులు విచారణ చేపట్టింది. ఈ కేసులో 5 మందిని అరెస్ట్ చేయగా.. వినూత దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

Updated on: Jul 12, 2025, 17:03:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీకాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు తమిళనాడులోని చెన్నైలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో అతని మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సెవెన్ వెల్స్ పోలీసులు… విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత దంపతులతో రాయుడు (మధ్యలో వ్యక్తి)
శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత దంపతులతో రాయుడు (మధ్యలో వ్యక్తి)

రాయుడుని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా గుర్తించగా…వీరిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్‌ వినూత, ఆమె భర్త చంద్రబాబు కూడా ఉన్నట్లు తేలింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం.

రాయుడు ఎవరు…?

శ్రీకాళహస్తి జ‌నసేన ఇంచార్జ్ గా ఉన్న వినూత వద్ద రాయుడు డ్రైవర్ గా పని చేశాడు. అంతేకాకుండా నమ్మినబంటుగా ఉంటూ ఇతర పనులు కూడా చేసేవాడు. కొన్ని కారణాల రీత్యా రాయుడుని పనిలో నుంచి తీసేసినట్లు తెలిసింది. కట్ చేస్తే…. జూలై 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు నివాసం వెనుక రాయుడి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. శ్రీకాళహస్తీకి కూడా వచ్చి పలు వివరాలను సేకరించారు. రాయుడిని హత్య చేసినట్లు నిర్ధారించారు. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వీరిలో శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత, భర్త చంద్రబాబు సహా శివకుమార్, షైక్ తాసాన్, గోపిలు ఉన్నారు.ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులోకి ఉన్నట్లు సమాచారం.

పోలీసుల విచారణలో ఉన్న వినూత దంపతులు కొన్ని కీలక విషయాలు బయటపెట్టారని తెలుస్తోంది. జూన్ 21న రాయుడిని పనిలో నుంచి తీసేసినట్లు వెల్లడించారని సమాచారం. తమకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేస్తున్నాడనే కారణంతో తొలగించినట్లు చెప్పినట్లు తెలిసింది. అనేక అనుమానాలకు తావు ఇస్తున్న రాయుడు హత్య ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

పార్టీ నుంచి బహిష్కరణ

మరోవైపు హత్య ఆరోపణల రావటంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా ఉన్న కోట వినుతను బహిష్కరించింది. హత్య కేసులో ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More