అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఓ విషయంలో తన వర్గీయులపై కేసులు నమోదు కాగా.. ఈ విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది.

ఇవాళ తాడిపత్రిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి… ASP రోహిత్ చౌదరిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. అసలు ఆయన ఏ మాత్రం ఏఎస్పీగా పనికిరాడన్నారు. తాడిపత్రిలో ఆయన వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదని… చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు.
“ నువ్వు పోలీస్ అయితే ఏంటీ..? నీకూ ఉండే రివాల్వర్ నాకున్నాయ్. ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకి దూరేవాళ్లం.. జాగ్రత్తగా ఉండు. రోహిత్ కు చదువు మాత్రమే ఉంది.. బుద్ధి, జ్ఞానం లేదు. నీలాంటి వారిని నా జీవితంలో చూడలేదు. త్వరలోనే మళ్లీ యూపీకి పంపుతాం” అంటూ జేసీ వార్నింగ్ ఇచ్చారు.
“నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడ లేడు. నువ్వు ఏం చేస్తావ్...? ప్రెస్ మీట్ లో కూర్చొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా..? పోలీస్ శాఖకే నువ్వు మచ్చలాంటి వ్యక్తివి. నేను నిన్ను వదిలిపెట్టను. గతంలో ఏఎస్పీగా పని చేసిన చైతన్యను పంపించాం. ఒక్కరోజు అయినా పోలీస్ డ్రెస్ లో కనిపించావా..? అసలు నీకు ప్రోటోకాల్ ఉందా...? డ్రెస్ లో విధులు నిర్వర్తించు. ఊర్లో వాళ్లను బాధ పెడితే ఊరుకోను. ఈ ఊరి ప్రజలెంటో నేను చూపిస్తా. నువ్వు అసలు ఐపీఎస్ ఎలా పాసయ్యావ్...? యూర్ ఆర్ నాట్ ఏ బాస్, యూ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. తమాషా చేస్తే నేను వదిలిపెట్టను..?”అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.
{{/usCountry}}“నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడ లేడు. నువ్వు ఏం చేస్తావ్...? ప్రెస్ మీట్ లో కూర్చొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా..? పోలీస్ శాఖకే నువ్వు మచ్చలాంటి వ్యక్తివి. నేను నిన్ను వదిలిపెట్టను. గతంలో ఏఎస్పీగా పని చేసిన చైతన్యను పంపించాం. ఒక్కరోజు అయినా పోలీస్ డ్రెస్ లో కనిపించావా..? అసలు నీకు ప్రోటోకాల్ ఉందా...? డ్రెస్ లో విధులు నిర్వర్తించు. ఊర్లో వాళ్లను బాధ పెడితే ఊరుకోను. ఈ ఊరి ప్రజలెంటో నేను చూపిస్తా. నువ్వు అసలు ఐపీఎస్ ఎలా పాసయ్యావ్...? యూర్ ఆర్ నాట్ ఏ బాస్, యూ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. తమాషా చేస్తే నేను వదిలిపెట్టను..?”అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.
{{/usCountry}}కొద్ది రోజుల కిందట తాడిపత్రి యాడికి ప్రాంతంలోని విద్యుత్ శాఖ ఆఫీస్‌లో జేసీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని జేసీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జేసీ వెంటనే కూడా స్పందించారు. ఏఎస్పీని అవినీతి అధికారి అంటూ కూడా ఆరోపించారు.
ఇంతలోనే ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జేసీ రెచ్చిపోయారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయటంతో…. ఏఎస్పీ వర్సెస్ జేసీ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిపోయింది.