Tadipatri JC vs ASP : ' రోహిత్ చౌదరి.... నువ్వు ఏఎస్పీగా పనికిరావు, నేను నిన్ను వదిలిపెట్టను' - జేసీ ప్రభాకర్ రెడ్డి వార

తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు ఆయన పోలీస్ అధికారిగా పనికిరాడు అంటూ కామెంట్స్ చేశారు. తుపాకులు నీ వద్దే కాదు.. మా వద్ద కూడా ఉన్నాయి అంటూ ఊగిపోయారు.

Published on: Oct 21, 2025, 17:47:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఓ విషయంలో తన వర్గీయులపై కేసులు నమోదు కాగా.. ఈ విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది.

ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి  ఫైర్
ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్

ఇవాళ తాడిపత్రిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి… ASP రోహిత్ చౌదరిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. అసలు ఆయన ఏ మాత్రం ఏఎస్పీగా పనికిరాడన్నారు. తాడిపత్రిలో ఆయన వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదని… చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు.

“ నువ్వు పోలీస్ అయితే ఏంటీ..? నీకూ ఉండే రివాల్వ‌ర్ నాకున్నాయ్‌. ఎస్పీ లేక‌పోతే నీ ఇంట్లోకి దూరేవాళ్లం.. జాగ్ర‌త్త‌గా ఉండు. రోహిత్ కు చదువు మాత్రమే ఉంది.. బుద్ధి, జ్ఞానం లేదు. నీలాంటి వారిని నా జీవితంలో చూడ‌లేదు. త్వరలోనే మళ్లీ యూపీకి పంపుతాం” అంటూ జేసీ వార్నింగ్ ఇచ్చారు.

“నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడ లేడు. నువ్వు ఏం చేస్తావ్...? ప్రెస్ మీట్ లో కూర్చొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా..? పోలీస్ శాఖకే నువ్వు మచ్చలాంటి వ్యక్తివి. నేను నిన్ను వదిలిపెట్టను. గతంలో ఏఎస్పీగా పని చేసిన చైతన్యను పంపించాం. ఒక్కరోజు అయినా పోలీస్ డ్రెస్ లో కనిపించావా..? అసలు నీకు ప్రోటోకాల్ ఉందా...? డ్రెస్ లో విధులు నిర్వర్తించు. ఊర్లో వాళ్లను బాధ పెడితే ఊరుకోను. ఈ ఊరి ప్రజలెంటో నేను చూపిస్తా. నువ్వు అసలు ఐపీఎస్ ఎలా పాసయ్యావ్...? యూర్ ఆర్ నాట్ ఏ బాస్, యూ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. తమాషా చేస్తే నేను వదిలిపెట్టను..?”అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.

కొద్ది రోజుల కిందట తాడిపత్రి యాడికి ప్రాంతంలోని విద్యుత్ శాఖ ఆఫీస్‌లో జేసీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని జేసీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జేసీ వెంటనే కూడా స్పందించారు. ఏఎస్పీని అవినీతి అధికారి అంటూ కూడా ఆరోపించారు.

ఇంతలోనే ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జేసీ రెచ్చిపోయారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయటంతో…. ఏఎస్పీ వర్సెస్ జేసీ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిపోయింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More