AP DMHO Recruitment : 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఖాళీలు, దరఖాస్తు తేదీలివే

గుంటూరులోని DMHO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ విధానంలో 45 ఖాళీలను భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jan 24, 2026, 17:59:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుంటూరులోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. మొత్తం 45 ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 2వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

డీఎంహెచ్‌ఓ గుంటూరు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
డీఎంహెచ్‌ఓ గుంటూరు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ నోటిఫికేషన్ - డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌, గుంటూరు
  • ఖాళీలు - 45
  • ఖాళీల వివరాలు : శానిటరీ అటెండెంట్‌ - 26, ల్యాబ్‌ టెక్నీషియన్‌- 8, ఫార్మసిస్ట్‌ 01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ - 3, ఫీమేల్ నర్సింగ్‌ - 7
  • ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు
  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, డీ ఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని అనుభవం తప్పనిసరి.
  • దరఖాస్తు - ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి. https://guntur.ap.gov.in/ వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంటుంది.
  • దరఖాస్తు రుసుం - బీసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ. 800, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500
  • దరఖాస్తు చివరి తేదీ - 2 ఫిబ్రవరి 2026
  • అధికారిక వెబ్ సైట్ - https://guntur.ap.gov.in/

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పొందొచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More