ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జస్టిస్ లీసాగిల్ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న జస్టిస్ లీసాగిల్‌తో సీజేగా ప్రమాణం చేయిస్తారు.
తొలి మహిళా సీజేగా…
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు. పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసాగిల్‌ను గతనెలలోనే ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో గతనెల 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.
ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకం వెనుక కొలీజియం ప్రత్యేకమైన 'పాలసీ'ని అనుసరించింది. సాధారణంగా ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తిని, ఆ బాధ్యతలు చేపట్టడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ గడువు ద్వారా సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు పనితీరు, స్థానిక వ్యవహారాలు మరియు న్యాయపరమైన సవాళ్లపై పూర్తి అవగాహన వస్తుందని కొలీజియం భావించింది.
ఈ నియామకానికి ముందు జస్టిస్ లిసా గిల్ పంజాబ్ , హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. కొలీజియం ప్రతిపాదన మేరకు ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు.
{{/usCountry}}ఈ నియామకానికి ముందు జస్టిస్ లిసా గిల్ పంజాబ్ , హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. కొలీజియం ప్రతిపాదన మేరకు ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు.
{{/usCountry}}జస్టిస్ లీసాగిల్ పాఠశాల విద్యను చండీగఢ్‌లో పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా నమోదయ్యారు. పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో పేరొందారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.