Justice Lisa Gill : ఏపీ హైకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం - తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్
Justice Lisa Gill : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లిసా గిల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో… కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది.జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు.
ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జస్టిస్ లీసాగిల్ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న జస్టిస్ లీసాగిల్‌తో సీజేగా ప్రమాణం చేయిస్తారు.
తొలి మహిళా సీజేగా…
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు. పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసాగిల్‌ను గతనెలలోనే ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో గతనెల 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.
ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర న్యాయశాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకం వెనుక కొలీజియం ప్రత్యేకమైన 'పాలసీ'ని అనుసరించింది. సాధారణంగా ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తిని, ఆ బాధ్యతలు చేపట్టడానికి రెండు నెలల ముందే సంబంధిత కోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ గడువు ద్వారా సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు పనితీరు, స్థానిక వ్యవహారాలు మరియు న్యాయపరమైన సవాళ్లపై పూర్తి అవగాహన వస్తుందని కొలీజియం భావించింది.
ఈ నియామకానికి ముందు జస్టిస్ లిసా గిల్ పంజాబ్ , హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. కొలీజియం ప్రతిపాదన మేరకు ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు.
జస్టిస్ లీసాగిల్ పాఠశాల విద్యను చండీగఢ్‌లో పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాదిగా నమోదయ్యారు. పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో పేరొందారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

