Kanipakam Brahmotsavam 2026 : ఈ నెల 14 నుంచి కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు

Kanipakam Brahmotsavam 2026 : ఈ నెల 14 నుంచి కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ కమిటీ ప్రతినిధులు సచివాలయంలో ఆహ్వానించారు.

Published on: Sep 4, 2026, 15:25:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kanipakam Brahmotsavam 2026 : చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు.

కాణిపాకం
కాణిపాకం

ఈనెల 14 నుంచి బ్రహ్మోత్సవాలు….

ఈ నెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పూతలపట్టు శాసనసభ్యుడు మురళీ మోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కాణిపాకం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ సురేంద్రబాబు తదితరులు ఉన్నారు.

సచివాలయానికి వచ్చిన ఆలయ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి చిత్రపటాన్ని, స్వామివారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను ముఖ్యమంత్రికి బహూకరించారు.

21 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు

ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాకంలో 21 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఉత్సవాలకు ముఖ్యమంత్రి రాక పట్ల ఆలయ యంత్రాంగం ఆశాభావంతో ఉందని ప్రతినిధులు వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More