ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
కార్తీక సోమవారం.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అభిషేకాలు, స్పర్శ దర్శనాల రద్దు
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం లక్షదీపోత్సవం జరగనుంది. మరోవైపు అభిషేకాలు, స్పర్శ దర్శనాల రద్దు చేశారు.
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శ్రీశైలం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.

వేకువజామునే శ్రీశైలం చేరుకున్న భక్తులు పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించి, కృష్ణమ్మ ఒడ్డున కార్తీక దీపాలను వదిలి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధుల్లో భక్తులు దీపారాధనలు నిర్వహించారు. వేలాది దీపాల వెలుగుల్లో మల్లన్న క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
కార్తీక మాసంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు కీలక మార్పులు చేశారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతి శని, ఆది, సోమవారాల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. సోమవారం రద్దీ అధికంగా ఉన్నందున భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు నాలుగు విడతల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
కార్తీక రెండో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని, సోమవారం సాయంత్రం ప్రధానాలయానికి ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఆదివారం ఒక్కరోజే 43,247 మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తుండగా, మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాలు జరుపుతున్నారు.

E-Paper
