ఇక మ్యాథ్స్ పేపర్ ఒక్కటే..! ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు - ముఖ్యమైన 10 పాయింట్లు
ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు ఉండనున్నాయి. గణితం పేపర్ ను 75 మార్కులకు కాకుండా… 100 మార్కులకు నిర్వహించనున్నారు. ఇక ఈ ఏడాది నుంచి ఒక్క మార్కు ప్రశ్నలు కూడా ఉంటాయి.
ఏపీలో ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు గణితం 1ఏ, 1బీ అని వేర్వురు సబ్జెక్టులు ఉండేవి. అయితే వీటిని ఒకే సబ్జెక్టుగా మార్పు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అంతేకాదు గతంలో ఒక్కో పేపర్ 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26గా ఉండేవి. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ ఉండగా 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కులకు ఎగ్జామ్ ఉండటంతో… మ్యాథ్స్ పేపర్లో పాస్ మార్కులు 35గా నిర్ణయించారు.

ముఖ్యమైన మార్పులు - వివరాలు:
- ఇంటర్ పరీక్షలు, సబ్జెక్టుల్లో పాస్ మార్కులు, పేపర్ల విధానంలోనూ మార్పులు ఉండనున్నాయి. ఇంటర్ లో ఈ విద్యా సంవత్సరం ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయడంతో పాటు పరీక్షల్లోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు తాజా విడుదల చేసింది.
- గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్గా మార్పు కానుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ ఉండనుంది. 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే… పాస్ మార్కులు 35గా ఉంటాయి.
- ఇక బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు ఉంటుంది.ఇందులో 43 మార్కులకు బోటనీ, 42 మార్కులకు జూవాలజీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉండగా.. పాస్ మార్కులు 29. అలాగే సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు.
- కొన్ని పేపర్లలో 30 శాతం మార్కులు వచ్చినప్పటికీ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ ఓవరాల్ గా అన్ని పేపర్లలో సగటు 35 శాతం మార్కులు వస్తే ఇంటర్ పాస్ అయినట్లే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి.
- గతంలో ఫెయిలై పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు.
- కొత్తగా ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానం ఉంటుంది. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటును విద్యాశాఖ తీసుకువచ్చింది.
- ఈ ఏడాది కొత్తగా ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఛాయిస్ ఉండదు.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లలో పాస్ మార్కులను కొంచెం తగ్గించారు. ఫస్టియర్ లో 29 మార్కులు, సెకండియర్ పరీక్షల్లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. రెండేళ్లలో కలిపి మీకు 59 మార్కులు వచ్చినా పాస్ అయినట్లే.
- ప్రస్తుతం ఫస్టియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలకు 85 మార్కులకు రాతపరీక్ష కాగా, పాస్ అవ్వడానికి 35 శాతం మార్కులు అంటే 29.75 మార్కులు రావాలి. ఇప్పుడు పాస్ మార్కులను 29 కి తగ్గించారు. ఫస్టియర్‌లో 29 మార్కులు వస్తే పాస్. సెకండియర్‌లో 85 మార్కులకు 30 మార్కులు సాధించాలి. అయితే 2 సంవత్సరాలు కలిపి చూసుకుంటే 35 శాతం మార్కులు అంటే 59.50 మార్కులు రావాలి. కానీ అర మార్కును తగ్గించారు. దీని ప్రకారం…. పాస్ మార్కులు 59 వస్తే చాలు.
- జాగ్రఫీ సిలబస్‌లో పెద్దగా మార్పులు లేవు. ఏ గ్రూపువారైనా ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. జాగ్రఫీ రాతప రీక్షను గతంలోలాగే 75 మార్కులకు నిర్వహించి…. 85 మార్కులకు లెక్కిస్తారు.
ఇక రాష్ట్రంలో 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎగ్జామ్ ఫీజులు కూడా స్వీకరిస్తున్నారు. రూ. 1000 ఆలస్య రుసుంతో ఈనెల 30 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











