AP EAPCET 2026 Preliminary Key Results : ఆంధ్రప్రదేశ్ లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) పరీక్ష రాసిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రిలిమినరీ కీని ఈరోజే (శనివారం) విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
ఈనెల 25న విడుదల
తాజా ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఈ నెల 25వ తేదీ (సోమవారం) ఉదయం 11:00 గంటలకు ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. కీతో పాటు అభ్యర్థుల 'రెస్పాన్స్ షీట్లను' (Response Sheets) సైతం అదే సమయంలో అందుబాటులో ఉంచుతామని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.మోహన్‌రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
విడుదల చేసిన ప్రిలిమినరీ కీపై విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11:00 గంటల వరకు మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తామని కన్వీనర్ తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక కీ లను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మే 12 నుండి మే 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఈఏపీసెట్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగాయి. ఈ ఏడాది పరీక్షలకు రికార్డు స్థాయిలో హాజరు నమోదైంది.
- మొత్తం దరఖాస్తులు: 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది (92.60 శాతం) పరీక్షకు హాజరయ్యారు.
- ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి 2,76,576 మంది రిజిస్టర్ చేసుకోగా, 2,58,545 మంది (93.48 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు.
- అగ్రికల్చర్, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): ఈ విభాగానికి 79,227 మంది దరఖాస్తు చేయగా, 70,929 మంది (89.53 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 1వ తేదీన ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలను (Results) అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు అవకాశం కల్పించారు. ఇంటర్ వెయిటేజీ మార్కులను కలపాల్సి ఉండటంతో జూన్ 1న ఫలితాల వెల్లడిపై స్పష్టత కరువైంది. ఈ విషయంపై విద్యాశాఖ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 1వ తేదీన ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలను (Results) అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు అవకాశం కల్పించారు. ఇంటర్ వెయిటేజీ మార్కులను కలపాల్సి ఉండటంతో జూన్ 1న ఫలితాల వెల్లడిపై స్పష్టత కరువైంది. ఈ విషయంపై విద్యాశాఖ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}ఇక ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే…. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.