AP EAPCET 2026 Results : ఏపీ ఎప్‌సెట్‌ అభ్యర్థులకు అలర్ట్ - ప్రిలిమినరీ కీ, అభ్యంతరాల గడువు తేదీలివే

AP EAPCET 2026 Preliminary Key Results : ఏపీ ఈఏపీసెట్ - 2026కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది.  ప్రిలిమినరీ ఆన్సర్ కీ,  రెస్పాన్స్ షీట్లు ఈనెల 25న అందుబాటులోకి వస్తాయి.  ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.మోహన్‌రావు ప్రకటించారు.

Published on: May 23, 2026, 22:09:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Preliminary Key Results : ఆంధ్రప్రదేశ్ లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) పరీక్ష రాసిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదల తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఏపీ ఈఏపీసెట్ 2026
ఏపీ ఈఏపీసెట్ 2026

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ప్రిలిమినరీ కీని ఈరోజే (శనివారం) విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.

ఈనెల 25న విడుదల

తాజా ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఈ నెల 25వ తేదీ (సోమవారం) ఉదయం 11:00 గంటలకు ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. కీతో పాటు అభ్యర్థుల 'రెస్పాన్స్ షీట్లను' (Response Sheets) సైతం అదే సమయంలో అందుబాటులో ఉంచుతామని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్ ఎన్‌.మోహన్‌రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

విడుదల చేసిన ప్రిలిమినరీ కీపై విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11:00 గంటల వరకు మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తామని కన్వీనర్ తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక కీ లను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మే 12 నుండి మే 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఈఏపీసెట్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగాయి. ఈ ఏడాది పరీక్షలకు రికార్డు స్థాయిలో హాజరు నమోదైంది.

  • మొత్తం దరఖాస్తులు: 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది (92.60 శాతం) పరీక్షకు హాజరయ్యారు.
  • ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి 2,76,576 మంది రిజిస్టర్ చేసుకోగా, 2,58,545 మంది (93.48 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు.
  • అగ్రికల్చర్, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): ఈ విభాగానికి 79,227 మంది దరఖాస్తు చేయగా, 70,929 మంది (89.53 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 1వ తేదీన ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలను (Results) అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు అవకాశం కల్పించారు. ఇంటర్ వెయిటేజీ మార్కులను కలపాల్సి ఉండటంతో జూన్ 1న ఫలితాల వెల్లడిపై స్పష్టత కరువైంది. ఈ విషయంపై విద్యాశాఖ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే…. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More