కొనసాగుతున్న ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు - కీ, మెరిట్ లిస్టులు ఎప్పుడంటే...?

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలన్నీ 30వ తేదీతో పూర్తవుతాయి. ఆ వెంటనే వీటికి సంబంధించిన కీలు అందుబాటులోకి వస్తాయి.

Published on: Jun 8, 2025, 10:15:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జామ్స్… 30 తేదీతో పూర్తికానున్నాయి. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. చివరిరోజు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షతో అన్ని పేపర్లు ముగుస్తాయి.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025

ఏపీ డీఎస్సీ కీలు ఎప్పుడంటే…?

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. డీఎస్సీపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. అంటే జున్ 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. జూలై 2వ తేదీన ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసే ప్రాథమిక కీలపై 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస్తారు. తుది కీ విడుదల చేసిన మరో ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితాలు విడుదలవుతాయి. అంటే ఆగస్టు నాటికి డీఎస్సీ పరీక్షల మెరిట్ జాబితాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కీలను విడుదల చేసే విషయం లేదా అభ్యంతరాలను పరిశీలించే విషయంలో ఒకటి రెండు ఆలస్యమైతే…. ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.

  • చివరి పరీక్ష పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
  • ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించడానికి 7 రోజుల సమయం ఇస్తారు.
  • అభ్యంతరాలు పూర్తైన తేదీ నుంచి 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు.
  • తుది కీ విడుదల చేసిన 7 రోజుల్లో డీఎస్సీ మెరిట్ లిస్టులు ప్రకటిస్తారు.

ఏపీ మెగా డీఎస్సీలోభాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక… సబ్జెక్టుల వారీగా హాజరైన అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.

ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేశారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More