...
...
Next Story

డోకిపర్రు మహాక్షేత్రంలో కన్నుల పండువగా కోటి దీపోత్సవం!

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Published on: Nov 5, 2025, 22:54:15 IST
Advertisement

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి వత్తికా దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధ దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ. పీ నాగిరెడ్డి, ప్రసన్న, నాగేశ్వర రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కోటి దీపోత్సవం
కోటి దీపోత్సవం

కోటి వత్తికా దీపోత్సవంలో పాల్గొన్న వారికి అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధ దంపతులు ఉచితంగా అందచేశారు. కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని మహాక్షేత్రంలో బుధవారం ఉదయం అభిషేకం, అర్చన కైంకర్యాలు, ప్రత్యేకంగా పూజలు చేశారు. శాస్త్రానుసారంగా కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి వత్తికా దీపోత్సవాన్ని వేద పండితులు నిర్వహించారు.

ఈ క్షేత్రంలో నిత్య, పక్ష, మాస, అర్థ సంవత్సర, సంవత్సర ఉత్సవాలు ఆలయ ధర్మకర్తలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం వంటి ప్రత్యేక రోజుల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి, పంటలు అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో శివుడు, విష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున తమ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఆయంలో కార్తీక దీపాన్ని ఒకసారి వెలిగిస్తే ప్రతిరోజూ వెయ్యి దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుందని ఆలయ పూజారులు వివరించారు. ఇలా చేయటం వ్లల భక్తులకు అష్ట ఐశ్వర్యలు సిద్ధిస్తాయని వేద వివరించారు. అందులో భాగంగానే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఒక్కో ప్రమిదలో 365 వత్తులతో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe