ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసి, విజయకేతనం ఎగరేసిన అభ్యర్థుల వివరాలు స్పష్టమవడంతో పురపాలక వర్గాలు కొత్త పాలకమండళ్ల కొలువుదీర్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించిన మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల అధికారిక ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 23వ తేదీన కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18వ తేదీలోపు ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు, వార్డు సభ్యులకు ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. నవంబర్ 23వ తేదీన డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్ పర్సన్ల పరోక్ష ఎన్నికలను నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ముగిసి తుది ఫలితాలు వెలువడటంతో, మున్సిపల్ బాధ్యతలు స్వీకరించేందుకు నూతన కార్యవర్గం సిద్ధమవుతోంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పురపాలక పీఠాల ఎన్నిక విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో వార్డు కౌన్సిలర్లు/కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వారి నుంచి మేయర్లు, ఛైర్పర్సన్లను ఎన్నుకునే పరోక్ష పద్ధతి అమల్లో ఉండేది. ఈసారి ఓటర్లే నేరుగా మేయర్లు, ఛైర్పర్సన్లను ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల సరళిని అమలు చేశారు. ఈ కొత్త మార్పుకు అనుగుణంగా గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఆదేశాలను జారీ చేయడానికి సిద్ధమైంది.
ఒకవైపు మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకార తేదీ ఖరారైనప్పటికీ, డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియపై ఎస్ఈసీ ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ పదవుల ఎంపిక విధానం, తేదీలకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
{{/usCountry}}ఒకవైపు మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకార తేదీ ఖరారైనప్పటికీ, డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియపై ఎస్ఈసీ ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ పదవుల ఎంపిక విధానం, తేదీలకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
{{/usCountry}}నూతన మున్సిపల్ చట్టాలు, ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా రాబోయే ఐదేళ్ల పాటు పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారంలో కొత్త పాలకమండళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోరులో కూటమి హవా చూపించింది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా కేవలం అనంతపురం స్థానాన్ని మాత్రమే వైసీపీ గెలుచుకుంది. మిగతా 12 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో జనసేన ఖాతాలో రెండు ఉన్నాయి. మరోవైపు మున్సిపాలిటీల్లోనూ కూటమి హవా కనిపించింది. ఈ నెల 23వ తేదీన కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్ పర్సన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.