రేషన్ బియాన్ని గుర్తించేలా కిట్లు.. స్పాట్‌లోనే బియ్యం పరీక్షించవచ్చు : మంత్రి నాదెండ్ల మనోహర్
పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. స్పాట్‌లోనే బియ్యం పరీక్షించేందుకు అందుబాటులోకి మెుబైల్ కిట్స్ తీసుకొచ్చామన్నారు. 700 మెుబైల్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. బియ్యం కిట్ పరీక్షలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే అవి రేషన్ బియ్యంగా నిర్ధారించవచ్చని వెల్లడించారు.

'గతంలో పట్టుకున్న బియ్యాన్ని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించాల్సి వచ్చేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన మెుబైల్ కిట్స్‌తో బియ్యాన్ని వెంటనే పరీక్షించవచ్చు. వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో మార్పులు తీసుకువచ్చాం. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. విశాఖలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. చెక్ పోస్టుల్లో 33 మంది సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో 24 గంటలు పని చేస్తారు.' అని మంత్రి నాదెండ్ల అన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్రమంగా తరలిస్తున్న 5.65 లక్షల క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అక్రమార్కులపై 230 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలకు మంచి బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం ఉపయోగంలో రాష్ట్రంలో మార్పు మెుదలైందన్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతీ సరకును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా చర్యలు తీసుకున్నామని, నగరంలో 33 మంది సిబ్బందితో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేరే రాష్ట్రా నుంచి తరలివస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామన్నారు. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
'చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందిస్తాం. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్ జారీ చేశాం. దుకాణాలకు ఎంత బియ్యం పంపించాం. పంపిణీ ఎంత అవుతుందని వివరాలను సేకరిస్తున్నాం.' అని మంత్రి నాదెండ్ల అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


