...
...
Next Story

పాదయాత్ర అంటూ మళ్లీ వస్తాడు జాగ్రత్త.. జగన్‌పై మాజీ మంత్రి కామినేని కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ కేవలం తన స్వలాభం, సొంత అజెండాతోనే వ్యవహరిస్తుంటారని తీవ్రంగా విమర్శించారు.

Updated on: Aug 9, 2026, 11:15:30 IST
Advertisement

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సొంత అజెండా తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలతో పని లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలో లేనప్పుడు ప్రజల్లోకి వస్తూ పాదయాత్రల పేరిట హామీలు ఇస్తారని, తీరా అధికారంలోకి వచ్చాక అంతఃపురం దాటి బయటకు రారని కామినేని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

కామినేని శ్రీనివాస్
కామినేని శ్రీనివాస్

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి మంచి పనికి, అభివృద్ధి కార్యక్రమాలకు తనదే క్రెడిట్ అని చెప్పుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని కామినేని విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను కూడా తానే తెచ్చానని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

మెరిట్ సాధించి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 16 వేల మందికి అవమానం జరిగేలా జగన్ అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులే దీనిపై అనవసర రగడ సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇందులో డీఎస్సీ, జెన్ జీవాళ్లు నిరసనల్లో ఎవరూ లేరని కామినేని అన్నారు.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికే మద్దతు తెలపగా, జగన్ మాత్రం ఇప్పటికీ మూడు రాజధానుల ముసుగులో అభివృద్ధిని అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాలు అనేది ఒక్క జగన్‌కి మాత్రమే నచ్చుతుందని, దేశంలో ఎవరికీ నచ్చడం లేదని ఆరోపించారు. భారతదేశంలోని ప్రతీ పార్టీ అమరావతికి మద్దతు తెలుపుతుందన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడే క్రమంలో కోర్టుల్లో వందలాది కేసులు వేస్తున్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి పలుమార్లు మొట్టికాయలు తిన్నా ఆయన తీరు మారలేదని కామినేని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe