రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీనరీకి ప్రాధాన్యం - మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
రాజధాని అమరావతి లో 30శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామని… వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు.
రాజధాని అమరావతి లో 30 శాతం గ్రీనరీకే ప్రాధాన్యం ఇస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. 133.3కి.మీల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకనుగుణంగానే వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు.

ఆలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి - మంత్రి నారాయణ
బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన… శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 22 రోడ్లలో రెండు వైపులా బఫర్ జోన్ లో గ్రీనరి అభివృద్ధి జరుగుతోందన్నారు. రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు. ఇంకా 2168 మంది రైతులకు 7743 ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.
రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని రైతులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. భూములుచ్చిన రైతులకు ఇంకా 719 ఎకరాల మేర ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు. 29 గ్రామాల పరిధిలో భూసమీకరణకు సహకరించని రైతుల్ని ఇవాళ్టికీ విజ్ఞప్తి చేస్తున్నామని… రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళ్తామని స్పష్టం చేశారు. సీఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మరోవైపు మరో విడత భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చి.. భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

