ఏపీలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 5వ తరగతి, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు వేర్వురుగా దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతేకాకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో అర్హులైన విద్యార్థులను కూడా ఎంపిక చేస్తారు.
ఈనెల 20 నుంచి దరఖాస్తులు

5వ తరగతిలో అడ్మిషన్ కోసం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వీరు ఈనెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు టెన్త్ పాసై ఉండాలి. లేదా ప్రస్తుతం పదో తరగతి చదవుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వీరు కూడా ఈనెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు https://apgpcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- AP BRAGCET 2026 ఆన్ లైన్ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు ఉండదు.
- 5వ తరగతి ఎంట్రెన్స్ కోసం 50 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పై ప్రశ్నలుంటాయి. 2 గంటల సమయం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియతో ఎగ్జామ్ ఉంటుంది.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం కూడా ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకుగానూ నిర్వహిస్తారు.
- గణితం, ఫిజిక్స్, బయాలజీ, సామాజిక అధ్యయనాలు, ఇంగ్లీశ్, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి.
- మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. పదో తరగతి స్థాయిలోప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్క్ తీసివేస్తారు.ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో ప్రశ్నాపత్రం ఇస్తారు.
- విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.