AP BRAGCET 2026 : ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు - నోటిఫికేషన్ జారీ, దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..?

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈనెల 20 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి.

Published on: Jan 14, 2026, 10:45:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు వేర్వురుగా దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతేకాకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో అర్హులైన విద్యార్థులను కూడా ఎంపిక చేస్తారు.

ఏపీ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలు
ఏపీ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలు

ఈనెల 20 నుంచి దరఖాస్తులు

5వ తరగతిలో అడ్మిషన్ కోసం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వీరు ఈనెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు టెన్త్ పాసై ఉండాలి. లేదా ప్రస్తుతం పదో తరగతి చదవుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వీరు కూడా ఈనెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు https://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • AP BRAGCET 2026 ఆన్ లైన్ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు ఉండదు.
  • 5వ తరగతి ఎంట్రెన్స్ కోసం 50 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పై ప్రశ్నలుంటాయి. 2 గంటల సమయం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియతో ఎగ్జామ్ ఉంటుంది.
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం కూడా ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకుగానూ నిర్వహిస్తారు.
  • గణితం, ఫిజిక్స్, బయాలజీ, సామాజిక అధ్యయనాలు, ఇంగ్లీశ్, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి.
  • మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. పదో తరగతి స్థాయిలోప్రశ్నలు అడుగుతారు.
  • ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్క్ తీసివేస్తారు.ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో ప్రశ్నాపత్రం ఇస్తారు.
  • విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More