ఏపీ : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 60 ఉద్యోగాలు - దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 9లోపు దరఖాస్తు చేసుకోవాలి.
రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 60 ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్ చేయనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… ఈ గడువు జనవరి 9,2026తో ముగియనుంది.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన -ప్రభుత్వ మెడికల్ కాలేజీ, రాజమండ్రి
- మొత్తం ఖాళీలు - 60
- ఖాళీల వివరాలు : ఆఫీస్ సబార్డినేట్ - 25, జనరల్ డ్యూటీ అటెండెంట్ - 19, స్టోర్ అటెండెంట్- 03, అనస్థీషియా టెక్నీషియన్ - 02, కార్డియాలజీ టెక్నీషియన్ - 03, ల్యాబ్ టెక్నీషియన్ - 02, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ - 2, ల్యాబ్ అటెండెంట్ - 01, ఈసీజీ టెక్నీషియన్ - 1, లైబ్రరీ అసిస్టెంట్- 1
- కాంట్రాక్ట్ ఉద్యోగాలు 11 ఉండగా, ఔట్ సోర్సింగ్ విధానంలో 49 పోస్టులను భర్తీ చేస్తారు.
- పోస్టును బట్టి అర్హతలుంటాయి. సంబంధిత విభాగంలో పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను https://eastgodavari.ap.gov.in వెబ్ సైట్ లో చూడొచ్చు.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు కొన్ని సడలింపులున్నాయి.
- దరఖాస్తు : ఆఫ్‌లైన్
- ఓసీ అభ్యర్థులు రూ.300, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- దరఖాస్తు చివరి తేదీ - జనవరి 9, 2026
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను “ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్/అడిషనల్ డీఎంఈ, ప్రభుత్వ మెడికల్ కళాశాల, రాజమహేంద్రవరం” చిరునామాకు పంపించాలి.
- అకడమిక్స్ లోని మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://eastgodavari.ap.gov.in
ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

