సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారి పల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మెరుగ్గా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పెన్షన్ ఇచ్చేందుకు 2 లక్షల మందికిపైగా వాలంటీర్లను పెట్టారని విమర్శించారు. అయితే దానికంటే మెరుగ్గా ప్రస్తుతం తమ ప్రభుత్వం మూడు గంటల్లోనే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.

'మా ప్రభుత్వంలో మెరుగ్గా పెన్షన్స్ పంపిణీ చేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేయడంతోపాటుగా సుపరిపాలన ద్వారా ఏపీ పునర్నిర్మాణం చేస్తున్నాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమిని గెలిపించి అధికారం అప్పగించారు. అందుకోసమే ఎల్లప్పుడూ ప్రజల గురించి మా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.' అని చంద్రబాబు అన్నారు.
అభివృద్ధి చేసి ఆదాయం వస్తేనే సంక్షేమం చేయగలమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతీ నెలా ప్రజలను కలిసేందుకు తాను వస్తున్నట్టుగా చెప్పారు. గత పాలకులలాగా బటన్ నొక్కొచ్చు, పరదాలు కట్టుకుని రావొచ్చునని విమర్శించారు. తాను ప్రజల మనిషిని అని అందుకే మీ దగ్గరకే వచ్చి పెన్షన్ ఇస్తున్నానని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోని పాలకులు హెలికాప్టర్‌లో వచ్చినా.. కింద చెట్లు నరికేసిన పరిస్థితి ఉండేదన్నారు. అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు.
పింఛన్ల కోసం రూ.50,764 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు చేశామని చంద్రబాబు అన్నారు. దేశంలో ఇదో రికార్డు అని, అతిపెద్ద డీబీటీ కార్యక్రమం ఇది అన్నారు. పెన్షన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొ్న్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆపబోమని స్పష్టం చేశారు.
తుపాను ప్రభావంతో ఏపీలో చాలా నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. రూ.5,244 కోట్ల ఆస్తి నష్టం రాష్ట్రంలో జరిగిందన్నారు. తుపాను నష్టంపై సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకంతోనే గూగుల్ సంస్థ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో డేటా సెంటర్ పెడుతుందన్నారు. పేదలకు సంక్షేమం అందించేలా సుపారిపాలన అందిస్తున్నామన్నారు.
{{/usCountry}}తుపాను ప్రభావంతో ఏపీలో చాలా నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. రూ.5,244 కోట్ల ఆస్తి నష్టం రాష్ట్రంలో జరిగిందన్నారు. తుపాను నష్టంపై సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకంతోనే గూగుల్ సంస్థ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో డేటా సెంటర్ పెడుతుందన్నారు. పేదలకు సంక్షేమం అందించేలా సుపారిపాలన అందిస్తున్నామన్నారు.
{{/usCountry}}