...
...
Next Story

AP SI Constable Recruitment : ఏపీ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తులు ప్రారంభం, ప్రాసెస్ ఇలా

APSLPRB SI Constable Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Published on: Nov 28, 2026, 12:21:22 IST
Advertisement

APSLPRB SI Constable Recruitment 2026 : ఏపీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు.. వారి అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఎస్సై పోస్టుల వివరాలు.. పరీక్ష షెడ్యూల్

ఏపీ ఎస్సై, కానిస్టేబుల్ దరఖాస్తులు షురూ
ఏపీ ఎస్సై, కానిస్టేబుల్ దరఖాస్తులు షురూ

ఎస్సై విభాగంలో మొత్తం 378 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిలో సివిల్ ఎస్సై (పురుషులు, మహిళలు) 253, ఏఆర్ రిజర్వ్ ఎస్సై (పురుషులు, మహిళలు) 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) ఎస్సై (పురుషులు) 9 పోస్టులు ఉన్నాయి.

ఎస్సై ప్రాథమిక రాత పరీక్షను 2027 ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.

కానిస్టేబుల్ ఖాళీలు.. పరీక్ష తేదీ ఇదే

కానిస్టేబుల్ స్థాయిలో మొత్తం 1,156 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా పోస్టుల సంఖ్య ఇలా ఉంది…

  • సివిల్ కానిస్టేబుళ్లు (పురుషులు, మహిళలు): 542
  • ఏఆర్ కానిస్టేబుళ్లు (పురుషులు, మహిళలు): 285
  • విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్లు: 158
  • జైళ్ల శాఖలో వార్డర్లు (పురుషులు): 150
  • జైళ్ల శాఖలో వార్డర్లు (మహిళలు): 21

ఈ కానిస్టేబుల్ పోస్టులకు కూడా నవంబరు డిసెంబరు 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షను 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

పోలీస్ ఉద్యోగాలు - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

  • ముందుగా https://slprb.ap.gov.in/UI/index వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • కానిస్టేబుల్ నోటిఫికేషన్లు, ఎస్సై నోటిఫికేషన్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటి పక్కనే ఉన్న అప్లై ఆన్‌లైన్ ఆప్షన్‌పై నొక్కాలి.
  • రిజిస్టర్ ఆప్షన్ ఎంచుకుని, ముందుగా జనరల్ డిక్లరేషన్ ఇవ్వాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఫీజు చెల్లింపు పూర్తయ్యాక దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • చివరగా అక్నాలెడ్జ్‌మెంట్ (Acknowledgement) పొందాలి.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks