...
...
Next Story

Paderu Forest Attack Drama : పాడేరు అడవుల్లో పాస్టర్ హత్యాయత్నం డ్రామా…! బట్టబయలు చేసిన పోలీసులు, షాకింగ్ నిజాలు

Paderu Forest Attack Drama : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అడవుల్లో పాస్టర్‌పై హత్యాయత్నం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో పక్కా స్క్రిప్ట్ డ్రామా అని పోలీసులు తేల్చారు. పాపులారిటీ, సానుభూతి కోసమే ఈ సినిమా స్టైల్… ప్లాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.

Published on: May 20, 2026, 10:57:09 IST
Advertisement

Paderu Forest Attack Drama : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. "పాస్టర్‌పై దుండగుల ఘాతుకం.. తృటిలో తప్పించుకున్న ప్రాణం.." అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎట్టకేలకు నిగ్గుతేల్చారు. అదంతా పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని, రిహార్సల్స్ చేసి ఆడిన ఒక అట్టర్ ప్లాప్ డ్రామా అని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.

సినిమా స్టైల్లో పక్కా స్క్రీన్ ప్లే….

పాడేరు అడవుల్లో పాస్టర్ హత్యాయత్నం డ్రామా !
పాడేరు అడవుల్లో పాస్టర్ హత్యాయత్నం డ్రామా !

పాడేరు అడవుల గుండా ఒక కారు వేగంగా వెళ్తుండటం.. ఒక్కసారిగా కొందరు వ్యక్తులు కారుకు అడ్డం వచ్చి రాళ్లతో దాడి చేస్తారు. ఆ దాడిలో కారు అద్దాలు పగిలిపోవడం.. లోపల ఉన్న వ్యక్తి ప్రాణాల కోసం హాహాకారాలు చేయడం.. ఈ దృశ్యాలన్నీ చూసిన వారంతా నిజంగానే దాడి జరిగిందని నమ్ముతారు. అయితే…. ఇదంతా కడపకు చెందిన, 'భరోసా' పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ సృష్టించిన ఒక పెద్ద స్క్రీన్ ప్లే డ్రామా. తనపై ఘోరంగా హత్యాయత్నం జరిగిందని ప్రపంచాన్ని…. జనాలను నమ్మించేందుకు ఆయన వేసిన కిలాడీ ప్లాన్ చూసి స్వయంగా పోలీసు అధికారులే విస్మయానికి గురయ్యారు.

జీకే వీధి మండలం చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఒక నిర్మానుష్య అటవీ ప్రాంతాన్ని ఈ డ్రామా షూటింగ్ కోసం వీరు వేదికగా ఎంచుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు…. బయట ఉండి దాడి చేసినట్లు నటించిన మరో ముగ్గురు.. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా కలిసి ఈ అటాక్ సీన్‌ను రక్తికట్టించారు. ఈ డ్రామాను నిజమైన హత్యాయత్నంగా నమ్మించడానికి పాస్టర్ అభినయ్ స్వయంగా శరీరంపై చిన్న గాయం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత బాధితుడి అవతారమెత్తి, రక్తం కారుతున్న విజువల్స్ తో సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రగా మారి…. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి వెళ్ళింది.

వెలుగులోకి షాకింగ్ నిజాలు….

"ఎక్కడ దాడి చేయాలి…? కెమెరా యాంగిల్ ఎలా ఉంచాలి….?" అంటూ నిందితులు ఒకరికొకరు పంపుకున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఆడియో మెసేజ్‌లు ఈ డ్రామాను పూర్తిగా బట్టబయలు చేశాయి. వీటికి తోడు, పాస్టర్ అభినయ్ దర్శన్ కు తగిలిన గాయాలు ఎవరో కొట్టడం వల్ల వచ్చినవి కావని, స్వయంగా చేసుకున్నవేనని డాక్టర్ల వైద్య నివేదికలో కూడా తేలడంతో పాస్టర్ అండ్ టీమ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

పాస్టర్ కేవలం పాపులారిటీ కోసమే ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారా? లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ కుట్ర దాగి ఉందా….? అనే కోణంలో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. సమాజంలో అపోహలు సృష్టించేలా, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా ఇలాంటి అటాక్ డ్రామాలు ఆడటంపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ కేసులో ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతుండగా…. మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను గ్రుడ్డిగా నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాటి వెనుక ఉండే నిజానిజాలను గమనించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వీడియోలను షేర్ చేయటం, ప్రచారం చేయటం వంటివి చేయవద్దని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks